సీనియర్‌ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

ప్రముఖ సీనియర్ హీరో అర్జున్ పై నటి శృతి హరిహరన్ చేసిన #మీ టూ ఆరోపణలు తీవ్ర రూపందాల్చాయి. ‘విస్మయ’ షూటింగ్ సమయంలో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నటి శృతి ఆరోపించగా అర్జున్ ఆమె వ్యాఖ్యలను ఖండించారు. అంతేకాదు శుక్రవారం శృతి పై 5 కోట్లకు పరువు నష్టం దావా కూడ వేశారు అర్జున్.

దానితో శృతి శనివారం అర్జున్ పై పోలీసు పిర్యాధు చేసింది. అందులో అర్జున్ తనను అసభ్యంగా తాకాడని ఆరోపంచింది. దీంతో పోలీసులు అర్జున్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.