
No release heores in 2025:
2025 టాలీవుడ్‌కి బిజీ ఇయర్. సంక్రాంతి మొదలు వేసుకుని భారీగా సినిమాలు రావొచ్చని భావించినా, కొందరు స్టార్ హీరోలు మాత్రం ఈ ఏడాది వెండితెరపై కనిపించరని కన్ఫర్మ్ అయింది. నందమూరి బాలకృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ సంక్రాంతి పోటీకి వచ్చారు. ఇక ఫిబ్రవరి, మార్చిలో యంగ్ హీరోస్ సినిమాలు బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీగా ఉన్నారు.
సమ్మర్‌కి పెద్ద సినిమాల పండుగే. బాలయ్య అఖండ 2 తో మరోసారి రాబోతున్నారు. నాగార్జున కీలక పాత్రల్లో నటించిన కుబేర, కూలీ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. కానీ, టాలీవుడ్‌లోని మరికొందరు స్టార్ హీరోలు మాత్రం ఈ ఏడాది సినిమాలతో రాలేరు.
NTR: ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉంటారు. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కూడా స్టార్ట్ అవ్వబోతోంది.
Mahesh Babu: పూర్తిగా రాజమౌళి సినిమా మీద ఫోకస్ పెట్టాడు. 2025లో అతని సినిమా రానట్టే.
Pawan Kalyan: రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమా షెడ్యూల్స్ క్లారిటీ లేదు.
Allu Arjun: ఇప్పటివరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. 2025లో ఆయన సినిమా వచ్చే ఛాన్స్ లేదు.
Nagarjuna: హీరోగా లీడ్ రోల్‌లో ఏ సినిమా రిలీజ్ అవ్వదనేది కన్ఫర్మ్.
ఇదిలా ఉంటే యంగ్ హీరోస్ మాత్రం వరుసగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2025లో వీరందరి సినిమాలు లేకపోవడం ఫ్యాన్స్‌కి కాస్త నిరాశగా అనిపించొచ్చు.