
WAR 2 Update:
WAR 2 సినిమా గురించి ఇంకా ఎంత చెబితే తక్కువే! యష్ రాజ్ ఫిల్మ్స్ తయారు చేస్తున్న ఈ స్పై యాక్షన్ డ్రామా ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే సినిమా షూటింగ్ ఎక్కువ భాగం పూర్తయింది. కానీ ఒక్క సాంగ్ మిగిలి ఉంది. అదే మాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న హైలైట్ డ్యాన్స్ సీక్వెన్స్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ డ్యాన్సింగ్ స్టార్స్ కదా, వీళ్లిద్దరికి మధ్య ఓ డ్యాన్స్ డ్యూయెల్ ఉండబోతోందట. అసలు ఈ పాటను మార్చ్‌లో షూట్ చేయాలి అనుకున్నా… హృతిక్ ప్రాక్టీస్‌లో గాయం పాలవడంతో వాయిదా వేసారు.
ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం… జూన్‌లో ముంబైలోని యష్ రాజ్ స్టూడియోలో ఈ పాటను షూట్ చేయనున్నారు. ఇది WAR 2 చివరి షెడ్యూల్ కూడా కావడం విశేషం. ఫాన్స్‌కి మాస్ ట్రీట్ అవ్వబోతోంది. అద్భుతమైన స్టెప్స్, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సాంగ్‌ను ప్యాక్ చేయబోతున్నారు అని టాక్.
WAR 2 అనేది YRF స్పై యూనివర్స్‌లో ఆరవ భాగం. ఇంతకుముందు “వార్”, “పఠాన్”, “టైగర్ 3” వంటి బ్లాక్‌బస్టర్స్ ఈ యూనివర్స్‌లో భాగమే. ఈ సిరీస్‌లో హృతిక్ మేజర్ కబీర్ ధలివాల్ పాత్రతో తిరిగి వస్తుండగా… ఎన్టీఆర్ విలన్ గెటప్‌లో అదరగొట్టబోతున్నారు.
సినిమాలో కియారా అద్వానీ కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. మొత్తం మీద జూన్ నెల నుంచి WAR 2 ప్రమోషన్స్ కూడా మొదలయ్యే అవకాశముంది. NTR ఫ్యాన్స్‌కు ఇది మాములుగా ఉండదు!
ALSO READ: Tollywood young hero joins Vijay Sethupathi-Puri Jagannadh’s next