ఈ కాంబినేషన్స్ సెట్ అవుతాయా..?

రామ్ చరణ్-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా అనుకొని ముహూర్తం షాట్ కూడా ముగిసిన తరువాత సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తరువాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కొరటాల-మహేష్ ల సినిమా పూర్తయిన వెంటనే చెర్రీతో సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ కొరటాల, ఎన్టీఆర్ తో కమిట్ అయ్యాడు. దీంతో ఇక చెర్రీ, కొరటాల కాంబినేషన్ మిస్టరీగా మిగిలింది. అలానే పవన్ కల్యాణ్-నేసన్ కాంబినేషన్ లో సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి వెళ్ళలేదు.
త్రివిక్రమ్ తో పవన్ సినిమా పూర్తి చేసిన తరువాత మరో దర్శకుడికి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాడే కానీ నేసన్ సినిమాపై మాత్రం ఆసక్తి చూపించడం లేదు. తాజాగా ఈ లిస్ట్ లోకి బన్నీ-విక్రమ్ కె కుమార్ ల కాంబినేషన్ కూడా చేరింది. దువ్వాడ జగన్నాథం సినిమా తరువాత విక్రమ్ తో సినిమా ఉంటుందని చెప్పిన బన్నీ ఇప్పుడు మాత్రం వక్కంతంకి ఓటేశాడు. అలానే బన్నీ కోసం విశాల్ సినిమా వదులుకొని మరీ ఎదురుచూస్తున్న లింగుస్వామితో ఎప్పుడు సినిమా చేస్తాడో.. తెలియని పరిస్థితి. సూపర్ స్టార్ మహేష్ బాబు-గౌతమ్ మీనన్ లు కూడా ఈ కోవలోకే వస్తారు. దాదాపు ఐదేళ్లుగా వీరి కాంబినేషన్ లో సినిమా అంటున్నారు కానీ ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు.