HomeTelugu Trendingబిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ సెల్ఫీ

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ సెల్ఫీ

Noel shared Bigg Boss 4 c

తెలుగు బిగ్‌బాస్‌-4 గ‌త ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అభిజీత్ విన్న‌ర్‌గా నిలిచాడు. ప‌ద‌హారు మంది సభ్యులతో ఈ షో మొదలైంది. అప్పటి వరకు షో శ్రతువులుగా ఉన్నవారు కూడా షో అయిపోగానే మేమంతా ఒక‌టే అని అంద‌రూ క‌లుసుకుని సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ సెలబ్రేష‌న్స్‌ను ప్ర‌తి సీజ‌న్‌లోనూ చూస్తుంటాం. ఈసారి కూడా అంతే అయ్యింది. బిగ్‌బాస్-4 కంటెస్టెంట్స్ అంద‌రూ క‌లుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ సెల‌బ్రేష‌న్స్ ఫొటోల‌ను నోయల్ త‌న ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

ఫొటోల‌తో పాటు ‘‘అంద‌రూ నా జీవితంలో ప్ర‌త్యేక స్థానాన్ని పొందారు. వారితో గ‌డిపిన ప్ర‌తి నిమిషం చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఇందులో కొందిరినీ మిస్ అయ్యాను’’ అని మెసేజ్ పోస్ట్ చేసిన నోయ‌ల్‌.. గంగ‌వ్వతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంద‌ని, అందుక‌నే తామిద్ద‌రం బిగ్‌బాస్ 4 నుండి ఎలిమినేట్ కాలేద‌ని, త‌మ‌కు తాముగా బ‌య‌ట‌కు వ‌చ్చేశామ‌ని మెసేజ్ పోస్ట్ చేశాడు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అంద‌రితో క‌లిసి ఉన్న ఫొటోను నోయ‌ల్ షేర్ చేశాడు. నోయల్‌ బిగ్‌బాస్ 4 హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న స‌మ‌యంలో అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌తో పెద్ద గొడ‌వే అయ్యింది. నోయ‌ల్ హౌస్ నుండి బ‌య‌ట‌కు వెళుతూ త‌మ‌ను విల‌న్స్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని అమ్మ రాజశేఖ‌ర్‌, అవినాష్ అన్నారు. మ‌రిప్పుడు ఈ ఫొటోలో చూస్తే అవినాష్‌ తీసిన సెల్ఫీలో నోయల్‌‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ కూడా ఉన్నారు. అంటే అవినాష్‌ సెల్ఫీతో ఈ ముగ్గురి మ‌ధ్య ఉన్న గొడ‌వ స‌ద్దుమ‌ణిగిన‌ట్లేన‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఈ సెల్ఫీలో కొంత మంది సభ్యులు మిస్‌ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Noel (@mr.noelsean)

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!