ఆ వార్తల్లో నిజం లేదు: అజయ్‌ దేవగణ్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటించడం లేదని బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అన్నారు. ఆయన ఇందులో అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీని గురించి అజయ్‌ను తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ.. ‘నేను ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటించబోతున్నాననే విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే.. అసలు ఈ ప్రాజెక్టు కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. కాబట్టి మీరు విన్నవార్తల్లో నిజం లేదు’ అని అజయ్‌ చెప్పారు.

మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇందులో హీరోయిన్‌ల వివరాల్ని చిత్ర బృందం ప్రకటించలేదు. ఆలియా భట్‌ నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆమె చరణ్‌ ప్రేయసిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates