
Richest Actress In The World:
మనకు ప్రపంచంలోని సంపన్న నటుల గురించి అనగానే టామ్ క్రూయిజ్, జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ, జానీ డెప్ పేర్లు గుర్తుకు వస్తాయి. వీరంతా తమ సినిమాలు, ప్రమోషన్లు, వ్యాపారాలతో కోట్ల రూపాయల సంపదను సొంతం చేసుకున్నారు. కానీ అందరిలోను అత్యంత ధనవంతురాలు ఎవరో తెలుసా? ఆశ్చర్యంగా, అది హాలీవుడ్ నటి జమీ గెర్ట్జ్.
చికాగోలో 1965లో జన్మించిన జమీ గెర్ట్జ్ సినీ పరిశ్రమలో 1980లలో అడుగు పెట్టారు. ఆమె “ఎండ్లెస్ లవ్”, “ది లాస్ట్ బాయ్స్”, “ట్విస్టర్” వంటి సినిమాలు, “స్టిల్ స్టాండింగ్”, “అలీ మెక్‌బీల్” వంటి టీవీ షోల్లో నటించారు. అయినప్పటికీ, ఆమె సంపదలో సినిమా రాబడి ఎంతో చిన్న భాగం మాత్రమే, సుమారు రూ. 10 కోట్లు.
1989లో వ్యాపారవేత్త టోనీ రెస్లర్‌ను వివాహం చేసుకోవడంతో ఆమె జీవితం మారిపోయింది. టోనీ ఆరెస్ మేనేజ్‌మెంట్ అనే కంపెనీని స్థాపించారు, ఇది రూ. 11 లక్షల కోట్ల (136 బిలియన్ డాలర్లు) విలువైన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను నిర్వహిస్తోంది. జమీ, టోనీ దంపతులు ఎన్‌బీఏ అట్లాంటా హాక్స్ బాస్కెట్‌బాల్ జట్టును, మిల్వాకీ బ్రూయర్స్ బేస్‌బాల్ జట్టులో వాటాలను కలిగి ఉన్నారు.
అయితే బాలీవుడ్‌లో అత్యంత సంపన్నుడు షారుక్ ఖాన్, ఆయన సంపద రూ. 7,300 కోట్లు. సల్మాన్ ఖాన్ రూ. 2,800 కోట్లు, అక్షయ్ కుమార్ రూ. 2,700 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కానీ జమీ సంపద షారుక్ సంపదకు దాదాపు 10 రెట్లు ఎక్కువ, సల్మాన్ సంపదకు 20 రెట్లు ఎక్కువ. ఆమె సంపద ప్రధానంగా వ్యాపార పెట్టుబడులు, జట్టు యాజమాన్యం ద్వారా వచ్చింది.
ALSO READ: Saif Ali Khan వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసా?













