
Saif Ali Khan Networth:
బాలీవుడ్ స్టార్ నటుల్లో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. ఆయన టాలెంట్, రాయల్ బ్యాక్‌గ్రౌండ్ తో అందరి మనసులు గెలుచుకున్నారు. అయితే జనవరి 15, 2025న ఆయన జీవితంలో ఒక భయంకరమైన ఘటన జరిగింది. బాంద్రాలోని సైఫ్ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. కుటుంబాన్ని రక్షించడానికి సైఫ్ ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. ఈ పోరాటంలో ఆయనకు ఆరు సార్లు కత్తి పోట్లకి గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించిన సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.
సైఫ్ అలీ ఖాన్ నెట్‌వర్త్:
సైఫ్ నెట్‌వర్త్ దాదాపు రూ. 1,200 కోట్లు. ఒక సినిమాకు రూ. 10-15 కోట్లు సంపాదిస్తూ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో కూడ భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. సైఫ్‌కు చెందిన ఇల్యూమినాటీ ఫిల్మ్స్, బ్లాక్ నైట్ ఫిల్మ్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్‌లు కూడా పెద్ద మొత్తాన్ని ఇస్తున్నాయి. ఆయన రాయల్టీ వారసత్వం, తెలివైన పెట్టుబడులు ఆయనను అత్యంత సంపన్న నటులలో ఒకరిగా నిలిపాయి.
సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన విలాసవంతమైన ఆస్తులు
1. పటౌడి ప్యాలెస్:
రూ. 800 కోట్ల విలువైన పటౌడి ప్యాలెస్ సైఫ్ రాయల్టీ వారసత్వానికి ప్రతీక. ఇది 150 గదులతో ఉన్న 10 ఎకరాల ప్రదేశం.
2. బాంద్రా హోమ్:
ముంబైలోని ఈ నాలుగు అంతస్థుల ఇల్లు రూ. 55 కోట్లు విలువైనది. ఇది యాంటీక్స్, ప్రైవేట్ లైబ్రరీ వంటి ప్రత్యేకతలతో ఉంది.
3. స్విస్ షాలే:
స్విట్జర్లాండ్‌లో రూ. 33 కోట్ల విలువైన ఒక అందమైన హాలీడే హోమ్.
4. క్రికెట్ టీమ్:
సైఫ్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా టీగర్స్‌ను కో-ఓన్ చేస్తున్నారు.
5. లగ్జరీ కార్లు:
రేంజ్ రోవర్, ఫోర్డ్ మస్టాంగ్, మెర్సిడెస్ వంటి విలాసవంతమైన కార్లు ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి.
6. డైమండ్ రోలెక్స్:
బ్రూనై సుల్తాన్ కుమార్తె ఇచ్చిన గిఫ్ట్‌గా ఒక విలువైన డైమండ్ రోలెక్స్ సైఫ్ వద్ద ఉంది.
ALSO READ: Saif Ali Khan మీద జరిగిన దాడి గురించిన షాకింగ్ విషయాలు!