‘నోటా’కి లైన్‌ క్లీయర్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న సినిమా ‘నోటా’. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షన్‌ రచయిత, నిర్మాతల మధ్య వివాదంతో ఈ సినిమా విడుదలపై గందరగోళం నెలకొంది.

అయితే తాజాగా చిత్రయూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్‌ 5న ‘నోటా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్‌ అయిన ట్రైలర్‌కు అద్భుతమై స్పందన వస్తోంది. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.