ఎన్టీఆర్ హీరోయిన్ రీఎంట్రీ!!

సాధారణంగా చాలామంది హీరోయిన్‌లు కెరీర్ మంచి జోష్ మీదున్న సమయంలోనే వివాహం చేసుకొని సెటిల్ అవుతుంటారు. వివాహం చేసుకున్న కొంత కాలం తరువాత తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. హీరోయిన్‌లు అందరు దాదాపుగా ఇలానే చేస్తున్నారు. ఈ బాటలో ఒకప్పటి టాప్ టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి కూడా నడుస్తోంది. 2016లో మనఊరి రామాయణం అనే సినిమాలో నటించిన తరువాత తిరిగి సినిమాల్లో నటించలేదు.

ఇప్పుడు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది. సినిమాల్లో నటించాలని లేకపోయినా.. అవకాశం వెతుక్కుంటూ రావడంతో ప్రియమణి తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం సిరివెన్నెల అనే సినిమాలో ప్రియమణి నటిస్తోంది. టాకీపార్ట్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నది.

ఈ సినిమా తరువాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.