ఎన్టీఆర్‌ బయోపిక్‌ కోసం వారంతగా వస్తున్నారట!

ఎన్టీఆర్‌ బయోపిక్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, ఆడియో రిలీజ్ ఈవెంట్ డేట్స్‌ను ఫిక్స్ చేశారు.ఆడియో ఈవెంట్ డిసెంబర్ 21 న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నది. అదే రోజు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా హాజరవుతారని సమాచారం. ఎన్టీఆర్ నాలుగురు కూతుర్లు లోకేలిరంధేశ్వరి, భువనేశ్వరి, ఉమా మహేశ్వరీలు హాజరవుతారని తెలుస్తున్నది. ఎన్టీఆర్ కూతుర్లు, కొడుకుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు హాజరవుతున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.