HomeTelugu Trendingబింబిసార: అన్న కోసం వస్తున్న ఎన్టీఆర్

బింబిసార: అన్న కోసం వస్తున్న ఎన్టీఆర్

NTR Coming for Bimbisara Pr
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. తన సొంత బ్యానర్లో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో.. జరిగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కల్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ఈ ఈవెంట్ కోసం ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ‘బింబిసార’ సినిమా లో కల్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్, ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ రావణ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని సీన్లను కలిపి రూపొందించిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. వస్తున్నా అంటూ బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ వాయిస్ వినిపించారు. ఈ సినిమాలో చరిత్రలో రాజుగాను, ప్రస్తుత కాలంలో మోడ్రన్ లుక్ లోను కల్యాణ్ రామ్ కనిపించనున్నాడు. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!