ఆ వార్త ఎన్టీఆర్ ను బాధ పెడుతోంది!

ఎన్టీఆర్ ఇప్పటివరకు క్లీన్ ఇమేజ్ ను మెయిన్టైన్ చేస్తూ వస్తున్నాడు. తన సినిమాలకు సంబంధించి కథ, కథనాలపైనే దృష్టి పెడతాడు కానీ పారితోషికం ఎంతనే విషయాన్ని కూడా పట్టించుకోడు. ఆయన ఫలానా సినిమాకు ఇంత తీసుకుంటున్నాడు.. ఇంత డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు ఎక్కడా వినిపించవు. అలాంటిది బుల్లితెరకు సంబంధించి ఆయన భారీ పారితోషికం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ తెలుగు వెర్షన్ షో కోసం దాదాపు 8 నుండి 10 కోట్లు తీసుకోబోతున్నాడనే వార్తలు వినిపించాయి. ఈ మాటలు ఎన్టీఆర్ ను బాధ పెడుతున్నాయట. అనవసరమైన ఈ హైప్ కారణంగా తన ఇమేజ్ కు డ్యామేజ్ కలుగుతోందని సన్నిహితుల వద్ద వాపోతున్నాడట ఎన్టీఆర్. తాను డబ్బు మనిషి కాదని, ఈ వార్తాల కారణంగా అందరూ అలా అనుకునే అవకాశం ఉందని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. మరి ఇంకా మాటల దశలోనే ఉన్న ఈ షోను ఎన్టీఆర్ అంగీకరిస్తాడో.. లేదో.. చూడాలి!