అమ్మకానికి ఎన్టీఆర్ ఇల్లు!

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఒకప్పుడునివసించిన ఇల్లు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ మద్య సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలపై హల్ చల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఎన్టీఆర్ ఇల్లు అమ్మకానికి రావడం ఆశ్చర్యకరం. చెన్నైలో టీ నగర్, బజుల్లా రోడ్డులోని హౌస్ నెంబర్ 28లో ఎన్నో ఏళ్ల క్రితం ఎన్టీఆర్ జీవించారు.

1953లో కొనుగోలు చేసిన ఈ ఇంటిని కొనుగోలు చేసిన ఎన్టీఆర్ తన అభిరుచికి అనుగుణంగా మరమ్మతులు చేయించుకున్నారు. కొంత కాలం తరువాత ఆ ఇంటిని తన తమ్ముడికి అప్పగించి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు ఎన్టీఆర్.

అయితే ప్రస్తుతం ఆ ఇల్లు ఖాళీగా ఉండడంతో అమ్మాకనికి పెట్టేసారు. చరిత్ర గలిగిన ఆ ఇంటిని అమ్మకానికి పెట్టడంతో ఎన్టీఅర్ అభిమానులకు బాధ కలిగిస్తోంది.