ఎన్టీఆర్ ఓకే చెబుతాడా..?

ఎన్టీఆర్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాల్లో ‘అదుర్స్’ కూడా ఒకటి. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. టీవీలో కూడా అనేకాసార్లు ఈ సినిమాను ప్రదర్శించారు. ఎన్నిసార్లు ప్రసారం చేసినా.. ఇప్పటికీ కూడా సినిమా మంచి రేటింగ్స్ వస్తుండడం విశేషం. అలాంటి సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన వినాయక్ కు ఎప్పటినుండో ఉంది. సీక్వెల్ కు తగిన కథను సిద్ధం చేయమని ఆయన తాజాగా కోన వెంకట్ కు కూడా చెప్పినట్లుగా
తెలుస్తోంది. ప్రస్తుతం కోన అదే పనిలో ఉన్నారు.

మొదట్లో ఈ సినిమా సీక్వెల్ పై ఎన్టీఆర్ కూడా మాట్లాడేవారు. ఆయన కూడా ఉత్సాహాన్ని చూపించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎంతవరకు ఉంటుందనేది చెప్పలేం. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్స్ పై పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఒకదానికొకటి డిఫరెంట్ గా ఉండే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఆ విధంగానే సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఆ కారణం చేత సీక్వెల్ లో ఎంతవరకు నటిస్తాడనే విషయాన్ని చెప్పలేని పరిస్థితి!