ఆకట్టుకుంటున్న వకీల్‌ సాబ్‌ ‘కదులు కదులు’ సాంగ్‌


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్ వేణు డైరెక్షన్‌లో తెరకెక్కిన్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్ర బృందం తాజాగా “కదులు కదులు” అనే పాట లిరికల్ వీడియోని తాజాగా విడుదల చేశారు. కదులు కదులు కదులు.. కట్లు తెంచుకుని కదులు.. వదులు వదులు వదులు.. బానిస సంకెళ్లను’ అంటూ సాగిన ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి థమన్ స్వరాలు అందించారు. ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ స్ఫూర్తిదాయక పాటకు సాహిత్యం అందించారు. సింగర్స్ శ్రీ కృష్ణ – హేమచంద్ర కలిసి ఈ గీతాన్ని ఆలపించారు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. బోనీ కపూర్ సమర్పించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు – శిరీష్ కలిసి నిర్మించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates