బాబీకు ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్!

ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని నటిస్తోన్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ మాత్రం ఈ షూటింగ్ కు హాజరు కాలేదు. దానికి కారణం ఆయన కొత్త లుక్ కోసం ప్రయత్నించడమే. దీంతో బాబీ మిగిలిన పాత్రల మధ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కు పెర్శనల్ గా ఖరీదైన లగ్జరీ రిస్ట్ వాచీ లంటే చాలా ఇష్టం. తనకు ఇష్టమైన వారికోసం కూడా ఎన్టీఆర్ ఇవే కొనుగోలు చేస్తూ ఉంటాడు.

జనతా గ్యారేజ్ సినిమా సమయంలో ఇలా ఒక వాచ్ ను దర్శకుడు కొరటాల శివకు బహుమతిగా ఇచ్చారని టాక్. ఇప్పుడు అలానే దర్శకుడు బాబీ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఖరీదైన వాచ్ ను తెప్పించి మరీ కానుకగా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాబీ కథను, తన పాత్ర తీరుతెన్నులను తీర్చిదిద్దడం ఎన్టీఆర్ ను బాగా ఆకట్టుకోవడంతో దాదాపు నాలుగు లక్షల రిస్ట్ వాచ్ ను బాబీకు అందజేశాడని చెబుతున్నారు.