
Dadasaheb Phalke biopic NTR:
ఇండియన్ సినిమా ఫౌండర్‌గా పేరుగాంచిన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై బాలీవుడ్ మీడియాలో భారీ వార్త హల్‌చల్ చేస్తోంది. అందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే… ఈ బయోపిక్‌లో ప్రధాన పాత్రగా ఎన్టీఆర్ నటించబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, ఆయన తండ్రి కార్తికేయ మరియు నిర్మాత వరుణ్ గుప్తా కలిసి ఎన్టీఆర్‌ను కలిసి స్క్రిప్ట్ వినిపించారట. ఎన్టీఆర్ స్క్రిప్ట్ విన్న వెంటనే వర్బల్‌గా ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గత ఏడాది Made In India అనే పేరుతో ఈ బయోపిక్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను రాజమౌళి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్క్రిప్ట్ పనులు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినిమా లవర్స్‌కు శుభవార్తే.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న వార్ 2 షూటింగ్ పూర్తి చేశాడు. ఆ తరువాత అతడికి దేవర 2 (కొరటాల శివ), నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో మరో సినిమా ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఫాల్కే బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్‌లో మరో ప్రెస్టీజియస్ అడిషన్ కాబోతుంది. ఇండియన్ సినిమాకు గౌరవం తీసుకొచ్చే ఈ బహుముఖ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడు అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Nani Paradise షూటింగ్ మొదలవకముందే 100 కోట్లు వచ్చేశాయా?