మహేష్ కథే కావాలని పట్టుబడుతున్నాడు!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘జై లవకుశ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేయాలనే నిర్ణయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో సినిమా చేయాలనేది ఎన్టీఆర్ ప్లాన్. గతంలో కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి కానీ వర్కవుట్
కాలేదు. అయితే ఈసారి మాత్రం ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్, ఎన్టీఆర్ కు ఓ లైన్ చెప్పాడు. అది ఎన్టీఆర్ కి బాగా నచ్చింది.

నిజానికి ఆ లైన్ త్రివిక్రమ్, మహేష్ బాబు కోసం రాసుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో అదే సినిమాగా చేద్దామని పట్టు బడుతున్నాడట. త్రివిక్రమ్ ఎంతగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. ఎన్టీఆర్ మాత్రం తనకు అదే కథ కావాలని మొండిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక చేసేదేమీ లేక త్రివిక్రమ్ అంగీకరించాడని అంటున్నారు.