HomeTelugu Trendingనాకు ఇబ్బంది అనిపిస్తే వేసుకోవడం మానేస్తా: బాలీవుడ్‌ బ్యూటీ

నాకు ఇబ్బంది అనిపిస్తే వేసుకోవడం మానేస్తా: బాలీవుడ్‌ బ్యూటీ

11 9
బాలీవుడ్ హాట్ బ్యూటీ నుష్రత్ భరూచా 2010లో వచ్చిన ‘తాజ్ మహల్’ సినిమాతో శివాజీ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమయ్యింది. బాలీవుడ్‌లో ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా’.. ‘ప్యార్ కా పంచనామా’, ‘సోనూ కే టిటూ కే స్వీటీ’ తదితర సినిమాల్లో నటించింది. మీటూ ఉద్యమ నేపథ్యంలో డైరెక్టర్‌ లవ్ రంజన్‌ తనను వేధించాడని ఓ మహిళ ఆరోపించగా…లవ్ రంజన్ సార్ చాలా మంచోడంటూ క్లీన్ చిట్ ఇచ్చేసింది నుష్రత్. సెల్ఫీ కోసమంటూ ఓ అభిమాని దగ్గరకు వచ్చి తన నడుము మీద చేయివేసాడని మండిపడి మొన్న ఆ మధ్య వార్తల్లో నిలిచింది ఈ అమ్మడు. తరచూ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు షేర్ చేస్తుందినుష్రత్.

విషయానికొస్తే ఇటీవల ఓ ఈవెంట్‌లో నుష్రత్ వేసుకున్న ఫోటోలు సెగలు పుట్టించాయి. నడుము పై వరకు స్కిన్ షో చేస్తున్న ఈ బోల్డ్ ఫోటోలను స్వయంగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె వేసుకున్న డ్రెస్ చాలా ఎబ్బెట్టుగా ఉందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. దీనిపై ధీటుగా సమాధానమిచ్చిన నుష్రత్..తన డ్రెస్‌పై ఇతరుల అభిప్రాయాలను తాను లెక్కచేయబోనని వ్యాఖ్యానించింది. దేశంలో అందరికీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని.. తన డ్రెస్‌పై అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందని పేర్కొంది. అయితే తన డ్రెస్ విషయంలో ఇతరుల కామెంట్స్‌ను తాను పట్టించుకోనని వ్యాఖ్యానించింది. తనకు ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇబ్బంది అనిమిస్తే మరోసారి వేసుకోనని పేర్కొంది ఈ హాట్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!