స్వామి వారి సినిమాకు సర్వం సిద్ధం!

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం షూటింగ్‌తోపాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. యం.యం.కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ చిత్రాల్లోని పాటలు సంచలన విజయం సాధించాయి.

యం.యం.కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడియోకి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలోని భక్తిరస గీతాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మరో భక్తిరస చిత్రంగా రూపొందిన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి.