
Paresh Rawal Exit from Hera Pheri 3:
కొద్ది రోజుల కిందట పరేష్ రావల్ ‘హెరా ఫేరి 3’ సినిమాను వదిలేశారన్న వార్త రాగా, అది శ్రోతల్ని, అభిమానులను, మిగతా నటులని కూడా షాక్‌కి గురి చేసింది. ఈ సినిమాతో ఆయన బాబు భాయ్యా పాత్ర ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం క్రియేటివ్ డిఫరెన్సులేనని కొంతమంది ఊహించారు. కానీ పరేష్ రావల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని ఖండించారు. “నేను ఎలాంటి క్రియేటివ్ గొడవలతో తప్పలేదు” అని తేల్చేశారు.
అయితే ఇదంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ అవుతోంది. కొంతమంది నెటిజన్లు పరేష్ రావల్‌ని “అన్‌ప్రొఫెషనల్” అని తిట్టేస్తున్నారు. అటు, అక్షయ్ కుమార్ కి మాత్రం చాలా మంది మద్దతు ఇవ్వడం కనిపిస్తోంది.
ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ప్రకారం, అక్షయ్ కుమార్‌కు చెందిన Cape of Good Films సంస్థ, పరేష్ రావల్‌పై రూ. 25 కోట్లు నష్టపరిహార నోటీసు పంపిందట. ఎందుకంటే, ఆయన స్క్రిప్ట్ మీటింగ్స్‌లో పాలుపంచుకుని, ఆ తర్వాత ఏమాత్రం చెప్పకుండా సినిమా నుంచి తప్పుకోవడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వచ్చిందట.
ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో, అక్షయ్ కెంప్ లో ఉన్నవారు “ఇది న్యాయమైన చర్య” అంటున్నారు. కానీ బాబు భాయ్యా పాత్రను మిస్సవుతామని ప్రేక్షకులు బాధపడుతున్నారు. ఇక పరేష్ రావల్ దీనికి ఎలా స్పందిస్తారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
‘హెరా ఫేరి 3’కు ఇంకా బాబు భాయ్యా తిరిగి వస్తారా? లేక కొత్త వ్యక్తి ఆ పాత్రను పోషిస్తారా? అన్నదే ఇప్పుడు అందరికీ డౌట్.
ALSO READ: Shah Rukh Khan’s King సినిమా నటీనటుల జాబితా చూస్తే షాక్ అవ్వాల్సిందే..