సాహో ఫస్ట్ లుక్ కాపీ కొట్టేశారు!

ఈరోజు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ‘సాహో’ చిత్రబృందం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నువిడుదల చేసింది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. బాహుబలి2 సినిమా రిలీజ్ సమయంలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. మళ్ళీ ఇంతకాలానికి ప్రభాస్ పుట్టినరోజు నాడు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే సినిమా క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది.

ముఖం కనిపించకుండా కర్చీఫ్‌ కట్టుకొని, ఓ చేతిని కోటు జేబులో ఉంచి.. మరో చేత్తో ఫోన్లో మాట్లాడుతూ నల్లటి దుస్తుల్లో ప్రభాస్ నడుచుకుంటూ వస్తున్న పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ బయటకు వచ్చిన కొద్ది సేపటికే విమర్శలు చేయడం
మొదలుపెట్టారు కొందరు నెటిజన్లు.

హాలీవుడ్ సినిమా ‘బ్లేడ్ రన్నర్’, ‘బ్లేడ్ రన్నర్ 2049’ సినిమాల పోస్టర్లను కలిపేసి ఈ సినిమా పోస్టర్ ను డిజైన్ చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారనుకోండి!