ప్రభుదేవాతో సల్మాన్ ఖాన్..?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్’,’దబాంగ్2′ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దబాంగ్3 చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహీనబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్భాజ్ ఖాన్ నిర్మించనున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సల్మాన్ ప్రస్తుతం ‘టైగర్ జిందా హై’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. ‘దబాంగ్3’ మొదలవుతుందని తెలుస్తోంది. మరి సల్మాన్, ప్రభుదేవాల కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ ను సృష్టిస్తుందో.. చూడాలి!