చంద్రబాబు-పవన్ రహస్య మిత్రులా?


మేం జనసేనతో పొత్తు పెట్టుకుంటే జగన్‌కు ఎందుకు బాధ అని నిన్న మీడియా సమావేశంలో చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోసారి టీడీపీ-జనసేన ఒక్కటవుతున్నారా అని చర్చ జరుగుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్‌ స్పందించారంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అది గతంలో జనసేన పొత్తులపై పవన్ చేసిన ట్వీట్. ఇక టీడీపీ-జనసేన పొత్తులపై వైసీపీ స్పందిస్తూ… అసలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు విడిపోయారు? అని ప్రశ్నించింది. ఒకప్పుడు వారిద్దరు అందరికీ తెలిసిన మిత్రులు.. ఇప్పుడు రహస్యంగా మిత్రులు.. వారి బంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది అంటూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పొలిటిక్ హీట్ పెంచుతున్నాయి… మేం జనసేనతో పొత్తు పెట్టుకుంటే జగన్‌కు ఏంటి? బాధ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడంతో మరోసారి టీడీపీ-జనసేన ఒక్కటికానున్నాయా? అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో గతంలో జనసేన పొత్తులపై వినిపించిన గుసగుసలపై పవన్ చేసిన ట్వీట్ మళ్లీ వైరల్ అయిపోయింది. ఇక టీడీపీ-జనసేన పొత్తులపై స్పందించిన వైసీపీ… అసలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎప్పుడు విడిపోయారు? అని ప్రశ్నించింది. ఒకప్పుడు వారిద్దరు బహిరంగ మిత్రులు..! ఇప్పుడు రహస్య మిత్రులు..! వారి బంధం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది అంటూ వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

చంద్రబాబు – పవన్‌తో కలిసినా, ఎవరితో కలిసినా మాకు బాధలేదు… మాకెందుకు బాధ ఉంటుంది… ఇప్పటికే కాంగ్రెస్‌తో కలిశారు, ఇంకెవరితో కలిసినా మాకు ఎలాంటి బాధా ఉండదంటూ వైసీపీ తన ప్రకటనలో పేర్కొంది. చంద్రబాబు లింగమనేని ఇంట్లో ఉంటాడు, ల్యాండ్‌ పూలింగ్‌లోకి ఆయన భూములు రాకుండా చూస్తాడు, అదే లింగమనేని పవన్‌కళ్యాణ్‌కు ఎకరం భూమి మార్కెట్‌ విలువ రూ. 4.5 కోట్లు ఉంటే రూ.30 లక్షలకు అమ్ముతాడని ఆరోపించారు. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు మధ్య లింగమనేని జాయింట్‌ బాక్స్‌ లాంటివారని వైసీపీ విమర్శించింది.

నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు మంచి చేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధిచేశామనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే.. కేసీఆర్‌లా ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తారని.. చంద్రబాబులో కాని, ఆయన పార్టీ టీడీపీలో కాని ఏమాత్రం నమ్మకం లేదని, అందుకే ఎవరో ఒకరు కావాలని నిరంతరం తపన పడుతున్నారని విమర్శించింది. నిన్నటి వరకూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఒకరినొకరు తిట్టుకున్నట్టు డ్రామా నడిపించారని వైసీపీ ఆరోపించింది. ప్రజలకు మాపై నమ్మకం ఉంది, మాకు ప్రజలపై నమ్మకం ఉంది. అందుకే ధైర్యంగా ముందడుగు వేస్తున్నాం. మాలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. చంద్రబాబు ఎవరితో కలిసినా మాకు బాధలేదని పేర్కొంది. నిజంగా వారిద్దరూ తిట్టుకుని ఉంటే, ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు వాస్తవమనుకుంటే ఇప్పుడు ఇద్దరూ కలవాలనుకుంటున్నారని, చంద్రబాబు.. పవన్‌ కోసం తాపత్రయ పడుతున్నారని చెప్పడం… వారికి ఎలాంటి విలువలు ఉన్నాయో తెలిపేందుకు ఒక ఉదాహరణ అని ఆరోపించింది.