HomeTelugu Newsఅలీని ట్రోల్‌ చేస్తున్న పవణ్‌ కల్యాన్‌ అభిమానులు

అలీని ట్రోల్‌ చేస్తున్న పవణ్‌ కల్యాన్‌ అభిమానులు

Pawan Kalyan fans trollingటాలీవుడ్‌ నటుడు పవన్ కల్యాణ్ బర్త్ డే ను ఇప్పటినుండే ట్రెండ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ‘#AdvanceHBDPawanKalyan’ అనే యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు అభిమానులు. కాగా పవన్ బర్త్ డే ట్రెండ్‌లో పాల్గొన్న అలీ.. ఈ సందర్భంగా పవన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్ కల్యాణ్..’’ అంటూ నమస్కారాలు తెలుపుతూ ఓ రెడ్ హార్ట్ సిగ్నల్‌ను అలీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈమద్య కాలంలో పవన్ కల్యాణ్‌, అలీ మద్య స్నేహం చెదిరింది. పవన్‌ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అలీ దూరం అయ్యాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్‌ పార్టీని కాదని వైసీపీలో అలీ చేరడం పవన్‌ ఫ్యాన్స్‌కు షాకింగ్‌గా మారింది. అదే టైమ్‌లో పవన్‌ గురించి అలీ విమర్శలు చేయడం మరింత కోపంను తెప్పించింది. దాంతో ఇప్పుడు పవన్‌ను పొగిడిన ఆయన అభిమానులు మాత్రం అలీని ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తిట్టి ఇప్పుడు మీరు ప్రశంసించినా ఆ మాటలు మరిచిపోలేం అంటూ అలీపై ట్రోల్స్ చేస్తున్నారు..

Recent Articles English

Gallery

Recent Articles Telugu