‘మిస్టర్‌ మజ్ను’ ఫస్ట్‌ లుక్‌

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మూడో చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను ఈరోజు రిలీజ్ చేశారు మూవీయూనిట్. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో అఖిల్‌ ప్లేబాయ్‌గా కనిపించనున్నాడు. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రేపు (గురువారం) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ కొత్త సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు.