పవన్ ఇన్వాల్వ్ కాకపోతేనే బెటరేమో..?

పవన్ కల్యాణ్ తన సినిమా కథల్లో ఇన్వాల్వ్ అవుతుంటాడనే విషయం ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులకు కూడా తెలిసిన విషయమే. స్క్రిప్ట్ పట్ల తన మార్క్ కనపడే వరకు అసలు రాజీపడడు. గతంలో పవన్ కల్యాణ్ వేలు పెట్టిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలయిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి ఇంక చెప్పనక్కర్లేదు. అభిమానులను బాగా నిరాశ పరిచిన సినిమా ఇదే. నటించడం విషయంలో పవన్ సాటి లేదు.
కానీ తనకు అచ్చిరాని విషయంలో కలుగజేసుకోవడం మంచిదికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే.. పవన్ మళ్ళీ తన సినిమా స్క్రిప్ట్ విషయంలో తలదూరుస్తున్నాడట. తమిళ డైరెక్టర్ నేసన్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమా రీమేక్ చేస్తున్నాడు పవన్. ఈ స్క్రిప్ట్ ను తెలుగు నేటివీటీకు తగ్గట్లు సిద్ధం చేసుకొని ఉత్సాహంగా పవన్ దగ్గరకు వెళ్ళిన నేసన్ నీరసంగా బయటకు వచ్చాడట. స్క్రిప్ట్ తనకు పెద్దగా నచ్చలేదని పవన్ కొన్ని మార్పులు, చేర్పులు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా.. పవన్ డైరెక్టర్ పనిలో.. ఇన్వాల్వ్ అవ్వకుండా.. అతడికి స్వేచ్ఛనిస్తే రిజల్ట్ బెటర్ గా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.