కొరటాలకు హ్యాండ్ ఇచ్చిన పవన్..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివకి షాక్ ఇచ్చాడని అంటున్నారు. దీనికి సంబధించిన వివరాల్లోకి వెళితే…పవన్ కళ్యాన్ 2019 ఎన్నికలలో కచ్ఛితంగా పోటీ చేస్తున్నారు. దానికి కావాల్సిన డబ్బు కోసం వరుస సినిమాలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకొని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేతున్నారు. అలాగే, తరువాత తమిళ దర్శకుడు ఆర్ టి నేసన్ దర్శకత్వం లో ఓ చిత్రాన్ని చేయనున్నాడు.

ఈ సినిమా 2018 లో విడుదల కానుంది. కొరటాల శివ ఇటీవల పవన్ కళ్యాణ్ ని కలసి సామాజిక నేపథ్యంతో ఉన్న ఓ కథని వివరించారని తెలుస్తుంది. కథ నచ్చినప్పటికీ రెండు సినిమాలు పూర్తయ్యే సమయానికి పవన్ రాజకీయాలతో బిజీ అయిపోతారు. దీంతో ప్రస్తుతానికి ఆ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత ఆలోచిద్దాం అని కోరటాలకి కాస్త బ్రేక్ ఇచ్చాడని అంటున్నారు. సినిమాని కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను అని కొరటాల చెప్పినప్పటికీ పవన్ మాత్రం నో చెప్పినట్లు తెలుస్తోంది.