Pawan Kalyan Upcoming Movies:
పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు చాలానే సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG సినిమా మీద కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సూపర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకులను బాగా అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానిగా.. పవన్ కళ్యాణ్ ను ఎలా చూపించాలో హరీష్ శంకర్ కి, సుజీత్ కి బాగా తెలుసు అని ఫ్యాన్స్ నమ్మకం.
అసలైతే ఉస్తాద్ భగత్ సింగ్ లేదా ఓజీ షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కావాల్సి ఉంది.. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన వరద పరిస్థితుల కారణంగా సినిమాకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ తన అన్ని ప్రాజెక్టుల షూటింగ్‌లను వాయిదా వేశారు.
Read More: Pawan Kalyan విషయంలో నోరు విప్పిన అల్లు అర్జున్
తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది పవన్ సినిమాల షూటింగ్ తిరిగి మొదలు కావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు వేచి ఉండమని పవన్, మేకర్స్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకు వస్తాయో చూడాలి.