పవన్‌ కల్యాణ్‌కు అకిరా సపోర్ట్‌

పవన్ కల్యాణ్‌ జనసేన పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబ సభ్యులలో ఒకరైన నాగబాబు నరసాపురం పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు బరిలో ఉండటంతో… కుటుంబ సభ్యులు ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కూతురు నిహారిక తండ్రి తరపున ప్రచారం చేస్తున్నది. అటు కొడుకు వరుణ్ తేజ్ కూడా ప్రచారంలోకి దిగాడు.

అల్లు అర్జున్ డైరెక్ట్ గా ప్రచారం చేయకపోయినా ట్విట్టర్ ద్వారా తన సపోర్ట్ నాగబాబుకు ఉంటుందని ప్రకటించాడు. జనసేన పార్టీ మార్పును తీసుకొస్తుందని భావిస్తున్నట్టు అల్లు అర్జున్ చెప్పడంతో పాటు పవన్ కల్యాణ్‌ ను ప్రశంసలతో ముంచెత్తాడు.

పవన్ కల్యాణ్‌ వారసుడు అకిరా నందన్ కూడా తండ్రికి సపోర్ట్ చేస్తూ పేస్ బుక్ ద్వారా చిన్న సందేశాన్ని ఇచ్చారు. సరైన నిద్ర లేకున్నా… వడదెబ్బ తగిలినప్పటికీ ప్రజా క్షేత్రంలో ప్రచారం చేయడం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని మెసేజ్ చేశాడు. మెగా కుటుంబ సభ్యులంతా పవన్ కు జనసేనకు సపోర్ట్ గా నిలవడం శుభపరిణామం అనే చెప్పాలి.