
Highest Paid Actor 2025:
పవన్ కళ్యాణ్ పేరే చెబితే అభిమానుల్లో పూనకం వస్తుంది. ఇటీవల రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిన ఆయన, సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే అభిమానులు ఎప్పటికీ ఎదురుచూస్తున్నారు – “పవన్ మళ్లీ ఎప్పుడెప్పుడు వెండితెరపై కనిపిస్తాడా?” అని.
ఇప్పుడు ఆ సమయం వచ్చింది! పవన్ కళ్యాణ్ తాజాగా తన సినిమా ప్రొడ్యూసర్లతో మీట్ అయ్యి, మూడూ పెండింగ్ సినిమాలకు క్లారిటీ ఇచ్చారు. అంటే మళ్ళీ పవర్‌స్టార్ బిగ్ స్క్రీన్ పైకి వచ్చేస్తున్నారు.
అందులో కీలకమైన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ఏకంగా రూ.170 కోట్లు! ఇది పాన్ ఇండియా ఫిల్మ్ కాకపోయినా, ఓ తెలుగు హీరోకు ఇచ్చిన హయ్యెస్ట్ పేమెంట్. ఇది టాలీవుడ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది.
View this post on Instagram
ఇదే పవన్ మాయ! రాజకీయాల్లో ఉన్నా కూడా ఆయన స్టార్ పవర్ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ‘హరి హర వీర మల్లు’ మేలో కంప్లీట్ చేయాలని ప్లాన్. ‘OG’ షూటింగ్ జూన్‌లో స్టార్ట్ అవుతుంది.
ఈ మూడూ సినిమాల వెనక ఉన్న పెద్ద బేనర్లు – ఏఎం రత్నం, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ – ఇప్పుడు రిలీఫ్‌గా ఫీలవుతున్నారు. పవన్ తన డేట్స్ క్లీర్‌గా ఇవ్వడంతో ప్లానింగ్ స్టార్ట్ చేశారు.
ఓటిటి రూమర్స్ ప్రకారం, ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ చివరి సినిమా కావొచ్చని చర్చ జరుగుతుంది. ఇది నిజం అయితే, ఈ సినిమా ఫ్యాన్స్‌కు చాలా ఎమోషనల్ గా మారనుంది.