పవన్‌ నిర్మాతగా రామ్‌ చరణ్‌ సినిమా!

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ నటించే తదుపరి చిత్రానికి పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్న రామ్‌ చరణ్ ఈ చిత్రం తర్వాత ఆయన నటించే చిత్రం ఏదీ ఇంతవరకు ఫైనల్ కాలేదు. ప్రస్తుతం కొందరు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నప్పటికీ, ఇంకా ఆయన ఏదీ ఒప్పుకోలేదట. ఇదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని కూడా ఈమధ్య చరణ్ కలిసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రానున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేయనున్నారు. ఇది పూర్తయ్యాక చరణ్ తో చేసే ప్రాజక్టుపై కూర్చుంటారని తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజక్టును చరణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ నిర్మించడానికి సిద్ధంగా వున్నట్టు చెబుతున్నారు. కాగా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates