కమల్ హీరోయిన్ రాజశేఖర్ తో!

అతి తక్కువ సమయం లోనే విశ్వరూపం సినిమాతో మంచి నటి గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజాకుమార్. దాని తరవాత కమల్ హాస కాంబినేషన్ లో వచ్చిన ఉత్తమ విల్లియన్ చిత్రం లో హీరోకి ధీటుగా తన నటన ప్రావీణ్యాన్ని కనబరిచింది. అలా భిన్నమైన పత్రాలు చేస్తూ నటనా పరంగా ముందుకు వెళుతున్న పూజ కుమార్ కి దాని తరవాత చాల అవకాశాలు పాత్రల రూపంలో వచ్చిన తన హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ & ముందు చేసిన మూవీస్ కి క్యారెక్టర్ సరితూగక వదులుకున్నా, ఇప్పుడు గరుడ వేగా అనే మూవీ లో స్వాతి అనే క్యారెక్టర్ తన కోసమే తీర్చి దిద్ద బడింది అని భావించి డా. రాజశేఖర్ సరసన భార్యగా 6 సంవత్సరాల బాబుకి తల్లిగా నటిస్తుంది.