తెలుగుదేశంపై ట్విట్టర్‌లో పవన్‌ సెటైర్లు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల గల్లంతు వ్యవహారంపై స్పందించారు. ఈమేరకు ట్విట్టర్‌ ద్వారా పవన్‌ సెటైర్లు వేశారు. ‘చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులు గురించి వింటాం. ఓట్లు ఎత్తుకెళ్లిపోయే గ్యాంగులను చూస్తున్నాం. మరి తెలుగుదేశం నాయకులు ఈ ఓట్ల గల్లంతు గురించి ఏం మాట్లాడతారు?’ అని పోస్ట్‌ చేశారు. దీనికి ఓ న్యూస్‌ ఆర్టికల్‌ను ట్యాగ్‌ చేశారు. ఓట్ల గల్లంతుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.