పవన్ డబ్బుకి లొంగిపోయాడా..?

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడనే మంచి పేరు పవన్ కల్యాణ్ కు ఉంది. పవన్ లోని ఈ క్వాలిటీ గురించి ఇండస్ట్రీలో వారితో పాటు పవన్ సన్నిహితులు కూడా చెబుతుంటారు. అయితే పవన్ మాత్రం ఏ.ఎం.రత్నం కి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదనే టాక్ బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం రత్నం కష్టాల్లో ఉన్న కారణంగా అతడిని గట్టెక్కించడానికి ఓ సినిమా చేసి పెడతానని పవన్ మాట ఇచ్చాడు. నేసన్ అనే తమిళ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. పూజా కార్యక్రమాలు మొదలుపెట్టి సంగీత దర్శకుడు తమన్ తో రెండు పాటల రికార్డింగ్ కూడా చేశారు.

కానీ ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా చేసే అవకాశాలు లేదని తెలుస్తోంది. అయితే దీనికో కారణముందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పవన్ కు నలభై కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారని అందులోనూ రెండు నెలల కాల్షీట్స్ మాత్రమే అడిగారని దీంతో ఆ ఆఫర్ కు పవన్ లొంగిపోయాడని చెబుతున్నారు. ఒకవేళ రత్నం సినిమా క్యాన్సిల్ అయి మైత్రి మూవీ మేకర్స్ సినిమా పట్టాలెక్కితే గనుక ఖచ్చితంగా ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.