చిరు, అనుష్క అంటే నో అంటున్నాడట!

చిరు 151 కోసం కథానాయికల వేట కొనసాగుతోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం బాలీవుడ్ హీరోయిన్లు విద్యాబాలన్, ఐశ్వర్యారాయ్ ల పేర్లు పరిశీలించినప్పటికీ వారు దక్షిణాది సినిమాలకు ఓకే చెబుతారా అనేది అనుమానమే. దీంతో చిత్రబృందం అనుష్క కాల్షీట్స్ కోసం సంప్రదించాలనుకున్నారు. ఉయ్యాలవాడ కథను హిందీలో కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.
బాహుబలి సినిమాతో అనుష్క అన్ని భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. చిరు సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవడం సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. కానీ చిరంజీవి మాత్రం దానికి నో అంటున్నాడట. కావాలంటే సమయం తీసుకొని బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుందాం గానీ స్వీటీ అయితే వద్దని చెప్పేస్తున్నారట. గతంలో చిరు 150వ సినిమా కోసం అనుష్కను సంప్రదించినప్పుడు ఆమె నుండి ఎటువంటి రెస్పాన్స్ రాలేదట. ఆ కారణంగానే ఇప్పుడు ఇప్పుడు చిరు, అనుష్కపై కోపం ఉన్నడని టాక్. మరి ఫైనల్ గా ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో చూడాలి!