పవన్ మరోసారి రిపీట్ చేయబోతున్నాడా..?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ అంటే హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పటివరకు ఇద్దరు కలిసి చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్. ఇప్పుడు మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఎపిసోడ్స్  అంచనాలకు రీచ్ అయ్యే విధంగా ఉండేలే జాగ్రత్తలు తీసుకుంటారు. పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ కూడా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఫైట్స్ మీద కంటే తన మాటల మీదే త్రివిక్రమ్ ఎక్కువగా దృష్టి పెట్టాడు. ఇప్పుడు మరోసారి 
పవన్ సినిమా కోసం అటువంటి క్లైమాక్స్ ను రిపీట్ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ ల సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత మిగిలిన బ్యాలన్స్ వర్క్ ను యూరప్ లో పూర్తి చేయనున్నట్లుగా తెలిపారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం హల్ చల్ చేస్తోంది. అత్తారింటికి దారేది సినిమా మాదిరి త్రివిక్రమ్ ఈ సినిమా క్లైమాక్స్ కూడా డిజైన్ చేశాడట. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మనసుకు హత్తుకునే సంభాషణలతో క్లైమాక్స్ సన్నివేశాలను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి అత్తారింటికి దారేది క్లైమాక్స్ ను రిపీట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి!