పవన్ అతనికి హ్యాండ్ ఇస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దర్శకుడు వి.వి.వినాయక్ కూడా గతంలో పవన్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశాడు కానీ కుదరలేదు. తాజాగా మరోసారి వినాయక్, పవన్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాక్టికల్ గా సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో వారం రోజుల్లో పవన్, త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ మీదకు వెళ్లనున్నారు.

ఈ సినిమా తరువాత నేసన్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. అయితే నేసన్ తో చేసే సినిమా తమిళ వేదాళం సినిమాకు రీమేక్. ఇప్పుడే రీమేక్ చేసి ఉన్న పవన్ మళ్ళీ రీమేక్ సినిమా చేయడానికి కొంత గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే నేసన్ సినిమాను పక్కన పెట్టి ఆ సినిమాకు బదులుగా వినాయక్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి!