పవన్, త్రివిక్రమ్ ల సినిమా మొదలైంది!

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే సినిమా హిట్ అనే అభిప్రాయంతో అభిమానులు ఉంటారు.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’,’జల్సా’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన
విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి సినిమా చేయడానికి సిద్ధపడ్డారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రానికి ‘దేవుడే దిగి వచ్చినా’ అనే
టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా పూజాకార్యక్రమాలు శనివారం రామానాయుడు స్టూడియో
లో జరిగాయి. పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ
సినిమాలో పవన్ కు అత్త పాత్రలో ఖుష్బూ కనిపించనుందని టాక్. ఈ చిత్రంతో త్రివిక్రమ్, పవన్ లు
హ్యాట్రిక్ కొట్టనున్నారనే నమ్మకంతో పవన్ అభిమానులు ఉన్నారు.