మా పార్టీకి ఎవరి అండ దండా అవసరం లేదు: పవన్‌

జనసేన పార్టీకి ఎవరి అండ దండా అవసరం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నారు. ఎన్నికల్లో పొత్తుపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన.. ఆ పార్టీతో కలుస్తుంది.. ఈ పార్టీతో కలుస్తుంది.. అని కొందరు అంటున్నారు. సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మనకు ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు. మన బలం జనం. చూపిద్దాం ప్రభంజనం’ అని ట్వీట్‌ చేశారు.