HomeTelugu Trendingక‌రోనా ప్రొటెక్ష‌న్ డ్రెస్‌లో పాయ‌ల్‌

క‌రోనా ప్రొటెక్ష‌న్ డ్రెస్‌లో పాయ‌ల్‌

11 8
టాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్ 100’తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి.. మళ్లీ ఆ రేంజ్ హిట్ రాలేదు. కాగా స్పెషల్‌ సాంగ్స్‌లో కూడా మెరుస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

తరచూ పాయల్ హాట్‌ హాట్‌ ఫొటోలతో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఎరుపు రంగులో ఉన్న క‌రోనా ప్రొటెక్ష‌న్ డ్రెస్‌ ధరించిన ఈ అమ్మడి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముంబైని మిస్ అవుతున్నానంటూ ఫేస్ మాస్క్ ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఊపిరి ఆడటం లేదని అసహనం వ్యక్తం చేసింది. తన డాక్టర్‌తో సహా బయలుదేరగా ఎయిర్ పోర్ట్‌లో ఫేస్ షీల్డ్ పెట్టుకుని ఫొటోలకు ఫోజుల్చింది ఈ హాట్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu