HomeTelugu Trendingరౌడీ పై మనస్సు పడ్డ పాయల్‌ రాజ్‌ పుత్!

రౌడీ పై మనస్సు పడ్డ పాయల్‌ రాజ్‌ పుత్!

8 25
కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. అందువల్ల సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఈ మధ్యే పిల్లో ఛాలెంజ్ స్వీకరించి అందరిని ఆశ్చర్యపరిచిన పాయల్ రాజ్ పుత్ కూడా అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే అభిమానుల్లో ఒకరు మీరు టాలీవుడ్ లో ఏ హీరో తో నటించాలనుకుంటున్నారు అని అడగ్గా.. ఆమె ఒక క్షణం కూడా ఆలోచించకుండా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అని సమాధానం ఇచ్చింది. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలు ఉన్న తనకు మాత్రం ఒకసారైనా సరే విజయ్ తో నటించాలని ఉంది అని సమాధానం ఇచ్చింది. అయితే పాయల్ నటించిన ఆర్ ఎక్స్ 100 సినిమా హిటైన ఈ అమ్మడుకి మాత్రం అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఈ మధ్య వెంకటేష్ సరసన నటించింది.. వెంకీమామ సినిమాతో మరో విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!