ప్రభాస్ విలన్ ఇతడే!

ప్రభాస్ తదుపరి సినిమా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ‘సాహో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి అన్ని భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక విలన్ పాత్ర కోసం నీల్ నితిన్ ముఖేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఆ తరువాత విలన్ గా టర్న్ తీసుకున్నాడు. తమిళ కత్తి రీమేక్ లో కూడా విలన్ అతడే. తెలుగులో కూడా తీసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ కుదరలేదు. అయితే ఇప్పుడు నీల్ నితిన్ ను తీసుకోవడం ద్వారా నార్త్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో.. చూడాలి!