రజనీ బర్త్‌డే గిఫ్ట్‌.. ‘పెట్ట’ టీజర్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం అభిమానులకు టీజర్‌తో బర్త్‌డే‌ ట్రీట్‌ ఇచ్చింది. తలైవా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పేట’. ఈ చిత్ర టీజర్‌ వచ్చేసింది. రజనీ స్టైల్‌గా నడుచుకుంటూ వెళుతున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. అభిమానులతో కలిసి తలైవా చిందులేయడం ఆకట్టుకుంటోంది. అద్దం ముందు నిలబడి స్టైల్‌గా కళ్లజోడు పెట్టుకుంటూ తలైవా నవ్వడం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇందులో రజనీకి జోడీగా సిమ్రన్‌, త్రిష నటిస్తున్నారు.

కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధిమారన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్‌ సేతుపతి విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖి కీలక పాత్ర పోషించారు. ఇందులో రజనీకాంత్‌ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయింది. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని ‘మరణ మాస్‌’ అనే పాటకు విశేష స్పందన లభించింది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates