HomeTelugu Trending'రణరంగం' నుంచి 'పిల్ల పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌' వీడియో సాంగ్‌

‘రణరంగం’ నుంచి ‘పిల్ల పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌’ వీడియో సాంగ్‌

5 28యంగ్‌ హీరో శర్వానంద్‌ నటిస్తున్న చిత్రం ‘రణరంగం’. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ హీరోయిన్‌గా నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘పిల్ల పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌’ అనే పాట వీడియోను సోమవారం విడుదల చేశారు. ఇందులో కాజల్ మోడ్రన్ గర్ల్‌గా కనిపించి, ఆకట్టుకున్నారు. శర్వానంద్‌ గుబురు గడ్డంతో ట్రెండీగా కనిపించారు. కాజల్‌ బీచ్‌ దగ్గర పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ సందడి చేశారు. ఆమె లుక్‌ కూడా చక్కగా ఉంది. మరోపక్క శర్వా మనుషుల్ని చంపుకుంటూపోతున్నారు. ఈ పాటను నిఖితా గాంధీ ఆలపించారు. సన్నీ ఎమ్‌.ఆర్‌ సంగీతం అందించారు. ఆగస్టు 15 ఈ సినిమా విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu