
టాలీవుడ్ బూట్టబొమ్మ పూజ హెగ్డే వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. పూజ హెగ్డే నటిచిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ తరువాత ఆమె నుంచి ‘ఆచార్య’ .. ‘రాధే శ్యామ్’ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆమె కెరియర్లో ప్రత్యేకమైనవిగానే చెప్పుకోవాలి. ఇటు చరణ్ జోడీగానూ .. అటు ప్రభాస్ జంటగానూ ఆమె చేయనున్న అందాల సందడి ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాల తరువాత ఈ బ్యూటీ త్రివిక్రమ్ – మహేశ్ ప్రాజెక్టులోను, పవన్ – హరీశ్ శంకర్ సినిమాలోను నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక నితిన్ జోడీగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కూడా ఆమె హీరోయిన్ అనేది టాక్. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడుకు మరో ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ హీరో ధనుశ్ టాలీవుడ్‌లో నేరుగా ఓ సినిమా చేస్తున్నారు. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీని తరువాత వెంకీ అట్లూరి ధనుశ్ సినిమా చేయనున్నట్లు.. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.













