HomeTelugu Trending‘భవదీయుడు భగత్‌సింగ్‌’లో పూజాహెగ్డే!

‘భవదీయుడు భగత్‌సింగ్‌’లో పూజాహెగ్డే!

pooja hegde with pawan kaly

పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్‌’. మైత్రీ మూవీమేకర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హరీశ్‌ శంకర్‌ బృందం పవన్‌కు జోడీ కోసం వేటాడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ కేక్‌గా గుర్తింపు పొందిన పూజాహెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసే పనిలో ఉన్నారని తెలిసింది. ఇప్పటికే హరీశ్‌ ఆమెతో చర్చలు కూడా జరిపారని, దాదాపు పూజా కన్‌ఫర్మ్‌ అయినట్లు తెలిసింది.

అయితే ఇంకా అడ్వాన్‌ తీసుకోలేదని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే నిజమైతే.. పూజాహెగ్డేకు పవన్‌తో తొలి చిత్రం, హరీశ్‌ శంకర్‌తో మూడో చిత్రం అవుతుంది. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లనుంది. ‘ఆచార్యా’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకున్న పూజా తమిళంలో ‘బీస్ట్‌’ తెలుగులో మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రాలకు సైన్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!