మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలంగా తెలుగులో హాల్ చల్ చేస్తుంది. హ్యాపీ డేస్ మొదలు కొని బాహుబలి వరకు భారీ హిట్స్ కొట్టింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది. పెద్దగా వివాదాల జోలికి పోకుండా తన పని తానూ చేసుకుపోయే తత్వం తమన్నాది. అది ఆమెకు కలసోచ్చిందనే చెప్పొచ్చు. విసుగు చెందేలా చేస్తే అంతే టఫ్ అమ్మాయి కూడా అంటుంటారు. ప్రస్తుతం క్వీన్ సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తుంది తమన్నా. ఇన్ని యాంగిల్స్ ఉన్న ఆమెకు ఒకటి అంటే చాలా భయమంట.
ఇటీవల తన భయం గురించి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ కోసం, విహారయాత్రల కోసం ఫారిన్ లోకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఎత్తైన ప్రదేశాలని చూస్తే బాడీ ఒనికిపోతుందని… ఏదన్నా వాహనంలో ఎత్తైన కొండ ఎక్కాల్సి వస్తే కళ్లు మూసుకుని కూర్చుంటా. ‘ఊపిరి’ షూటింగ్ టైమ్‌లో ఫారిస్ అందాల్ని ఆస్వాదించాను కానీ.. టవర్ దగ్గరికి వెళ్లేసరికి చాలా భయం వేసిందని తన బలహీనతను బయటపెట్టింది.