ఎన్టీఆర్ తో షో.. షరతులు వర్తిస్తాయి!

జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీ ఖరారైంది. మాటీవీ యాజమాన్యం ఎన్టీఆర్ ముఖచిత్రంతో ‘బిగ్ బాస్’ షో పోస్టర్ ను విడుదల చేశారు. ఒకట్రెండు నెలల్లో ఈ షో మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ షోకి సంబంధి వినిపిస్తున్న తాజా విషయమేమిటంటే.. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో మొదటి ఎపిసోడ్స్ చిత్రీకరణ హైదరాబాద్ కు బదులుగా ముంబై స్టూడియోస్ లో చిత్రీకరించాలని ఎన్టీఆర్ షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. తన బుల్లితెర ఎంట్రీ టాప్ క్లాస్ ఉండాలని కోరుకుంటోన్న ఎన్టీఆర్ ముంబై స్టూడియో, బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ ఇలా కొన్ని షరతులు పెట్టాడట. 
ఇప్పటికే ఈ షో కోసం ఎన్టీఆర్ కు భారీ పారితోషికం సమర్పించుకుంటోన్న మాటీవీ వాళ్ళు, ఈ అదనపు ఖర్చులకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ షో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఇంత మొత్తం పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ షో కి సంబంధించిన ఇంట్రడక్షన్ షూట్ మాత్ర్రమే ముంబైలో తీసి మిగిలిన తతంగాన్ని హైదరాబాద్ లోనే చిత్రీకరించాలని చూస్తున్నారు.